పప్పుశనగ పంపిణీలో రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన యల్లనూరు వ్యవసాయాధికారిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం తాడిపత్రిలో ఏడీఏ చెంగలరాయుడుకు రైతు సంఘం కార్యదర్శి రాజారామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. యల్లనూరు మండలంలోని వెన్నపూసపల్లిలో రైతులకు 40 కిలోల చొప్పున పప్పుశనగను పంపిణీ చేయకుండా కేవలం 20 కిలోలు పంపిణీ చేస్తున్నారన్నారు.