విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంపై నిరసన

73చూసినవారు
అంతరాయం లేకుండా తొమ్మిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయాలని కోరుతూ యాడికి మండలంలోని నిట్టూరు విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ట్రాన్స్ కో ఏఈ రాజరావు మాట్లాడుతూ సమస్యను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదున్నారు.

సంబంధిత పోస్ట్