తాడిపత్రిలోని పుట్లూరురోడ్డు రైల్వే గేటు సమీపంలో మంగళవారం పుట్లూరు మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథ రెడ్డి (62) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశ్వనాథరెడ్డి ఐదేళ్ల కిందట రెండు మోకాళ్లు దెబ్బతినడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి మళ్లీ కాళ్లు విరగడంతో మళ్ళీ శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతూ వస్తున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.