రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ ఐ ఆర్చరీ పోటీలకు తాడిపత్రి యువకుడు ఎంపికయ్యాడు. అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి అండర్-19 ఆర్చరీ విభాగంలో తాడిపత్రికి చెందిన వెంకట హర్షవర్ధన్ రావు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి అండర్-19 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థి ఎంపికపై కోచ్ రఫీ, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.