తాడిపత్రిలోని జింక వారి వీధిలో ఇరువర్గాలు రాళ్లదాడులకు గురువారం పాల్పడ్డారు. అనంతపురం జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మీనారాయణ కుమారుడు రవితేజకు రజక వీధికి చెందిన సాయి కృష్ణ కు పాత కక్షలు నేపథ్యంలో దాడులకు పాల్పడ్డారు. మణికంఠ అనే యువకునికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాళ్ల దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.