గుర్రపు స్వారీ, వాహనాల డ్రైవింగ్ చేయడం అంటే తనకు చిన్నప్పటినుంచి ఎంతో మక్కువ అని మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని తన నివాసం వద్ద శనివారం ఆయన స్థానికుడైన తాతయ్య శర్మకు చెందిన గుర్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మేలిమి గుర్రాలు ఎక్కడ ఉంటాయని, తనకు ఒకటి కావాలని కోరారు. మహారాష్ట్రలోని అక్లూజ్ అనే పట్టణంలో సంత జరుగుతుందని, అక్కడ మేలిమి గుర్రాలు దొరుకుతాయని తెలిపారు.