శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాల, హోలీ సందర్భంగా యాడికిలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. వేడుకలను శాంతియుత వాతావరణం నడుమ భక్తి భావంతో నిర్వహించుకోవాలన్నారు. హోలీలో ఇతరులకు భంగం కలిగేలా ప్రవర్తించరాదన్నారు. శుక్రవారం ముస్లింలకు జుమ్మా ప్రత్యేక ప్రార్థనలు, హోలీ, రథోత్సవం ఉండటంతో ఎటువంటి అల్లర్లు, గొడవలు, సమస్యల జోలికి వెళ్లరాదన్నారు.