యాడికి పట్టణంలో శుక్రవారం జరగనున్న చెన్నకేశవ స్వామి కల్యాణం, బ్రహ్మ రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ పరిశీలించారు. ముందుగా ఆలయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి ఉమాదేవి కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఉండాలని సభ్యులకు ఎమ్మెల్యే ఆదేశించారు.