యాడికి: చికిత్స పొందుతూ ఒకరి మృతి

71చూసినవారు
యాడికి: చికిత్స పొందుతూ ఒకరి మృతి
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ధర్మవరం పట్ట ణానికి చెందిన చెండ్రాయుడు (37) రాయలచెరువులోని ఓ హోటల్లో దినసరి కూలీకి పనిచేస్తుండేవాడు. అయ్యప్పమాల ధరించడంతో 14న వేకువజామున స్నానానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్