కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు బ్యాళ్ళ ప్రసాద్ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఉరవకొండ నియోజవర్గ ప్రజలకు తెలిపారు. అయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగని, మూడు రోజులపాటు నిర్వహించుకునే ఈ పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుందన్నారు.