కూడేరులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షం వల్ల పలు ప్రాంతాలు జలమయం ఆవ్వడంతో పాటు పరిసరాలన్ని చల్లగా మారాయి. భారీ వర్షంలోనే పలు వాహనదారులు రాకపోకలు సాగించారు. భారీ వర్షం కురవడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు పశువులకు పశుగ్రాసం సులభంగా దొరుకుతుందని రైతులు, తదితరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం వల్ల స్థానికులు గృహాలకు పరిమితమయ్యారు.