కూడేరు మండలంలో ఏపీ రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కడదరకుంట గ్రామంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. తాడు లాగుట, కుర్చీలాట, డాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తో ఆటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన విద్యార్థులకు పెన్నులు కంపాస్ లు బుక్స్ తదితరు వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నారాయణరెడ్డి, వీరప్ప, వెంకటేష్, రాధాకృష్ణ, మల్లికార్జున పాల్గొన్నారు.