నల్లచెరువులో ఘనంగా నవరాత్రి వేడుకలు

62చూసినవారు
నల్లచెరువులో ఘనంగా నవరాత్రి వేడుకలు
నల్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం కన్యకపరమేశ్వరి అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అమ్మవారికి భక్తులు విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్