కూడేరు మండలంలో రేపు రెవెన్యూ భూ సదస్సులు కూడేరు సచివాలయం దగ్గర నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ మహబూబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోంది అని, ఈ సదస్సులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని శుక్రవారం తెలిపారు.