కలకత్తా వైద్యకళాశాల జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉరవకొండలో కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తమ విధులను బహిష్కరించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డాక్టర్ పై కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. సభ్య సమాజం ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని కోరారు.