గ్రామీణ నిరుద్యోగ యువత, విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటే సులభతరంగా ఉద్యోగాలు పొందవచ్చని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం ఉరవకొండ పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశిష్ట స్పందన లభించింది. మంత్రి మాట్లాడుతూ ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని సంబంధం లేకుండా అనుభవాన్ని పెంచుకోవడానికి వచ్చిన ప్రతి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.