అర్బన్ హెల్త్ సెంటర్ లో గర్భిణీలకు నెలవారి ఆరోగ్య పరీక్షలు గైనిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం ఆముదాలవలస మోణింగివారివీధిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ డి.సురేష్ ఆధ్వర్యంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సత్యసాయి మందిరం లక్ష్మీనగర్ భజనమండలి వారిచే మహిళలకు అమృత ఆహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది సాయి సేవకులు పాల్గొన్నారు.