ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామంలో 'మన ఊరు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్' వారు రైతులకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఊరు ఫార్మర్ సిబ్బంది మెట్ట స్వర్ణలత మాట్లాడుతూ. ఇందులో సభ్యత్వం తీసుకోవడం వలన రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, తదితర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని తెలిపారు.