ప్రపంచాన్ని కమ్మేస్తున్న ప్లాస్టిక్ మహమ్మారినిపై ఉద్యమించాలని ఉత్తమ ఉపాధ్యాయులు పూజారి రమణ మూర్తి తెలిపారు. సోమవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్బంగా కేదారిపురంలో పాఠశాల విద్యార్థులకు వివరిస్తూ ఓజోన్ పొరను రక్షించుకోపోతే ఈ భూమిపై ఉన్న ఏ జీవరాశి ఐనా మనుగడ కష్ట సాధ్యమని వివరించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.