రాష్ట్రంలో స్వర్ణాంధ్ర దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగుతోందని.. ప్రజలు ఎవరు అసంతృప్తితో లేరని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షులు బీవీ రామ్ అన్నారు. సోమవారం ఆముదాలవలస టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలన చేపట్టి 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి ప్రజలకు అందిస్తుందని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు.