ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి కృష్ణాపురం గ్రామంలో మంగళవారం ఉదయం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కూన అప్పలనాయుడు, మాజీ వైస్ చైర్ పర్సన్ కూన రాజ్యలక్ష్మి ప్రతినిధి భానోజీ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందని వారు అన్నారు.