ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ చొరవతో అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సిబ్బంది మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొందూరు మండలం పెనుబర్తి అంగన్వాడి కేంద్రం నిర్మాణానికి రూ. 10 లక్షలు, తండ్యం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం భావన నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. పలువురు మండల వాసులు ఆనందం వ్యక్తం చేశారు.