జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో మంగళవారం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆమదాలవలస ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో ముమ్మరంగ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రైల్వే స్టేషన్, రైల్వే పార్శిల్ కార్యాలయంలో ఆర్పిఎఫ్ పోలీసులతో కలిసి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామన్నారు.