ఆమదాలవలస: గత ప్రభుత్వంలో చెత్తపై పన్ను వసూలు చేశారు

65చూసినవారు
వైసిపి ప్రభుత్వంలో చెత్తపై కూడా పన్ను వసూలు చేసి పేదలను ఇబ్బందులకు గురి చేశారని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ తెలిపారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సంబంధిత మంత్రికి సమస్యలను తెలిపారు. రేషన్ కార్డులను కూడా తొలగించారని ఎమ్మెల్యే ఆరోపించారు. చెత్తపై ఎంత మేరకు నిధులు స్వీకరించారన్న ఆయన అలా వసూలు చేసిన నిధులు ఎలా ఖర్చు చేశారనేది సమగ్ర విచారణ జరిపించాలని సభ దృష్టికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్