బూర్జ మండలం ఉప్పినివలస జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం జాతీయ డి వార్మింగ్ డే కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. శారీరక మానసిక వికాసానికి, విద్యార్థుల్లో ఆహరం పరిపుష్టికి, రక్త సమృద్ధికి ఆల్బెండజోల్ టాబ్లెట్లను పంపిణీ చేశామని అన్నారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.