వైద్య విద్యార్థిని ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ నిరసన తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆముదాలవలసలో మంగళవారం రాత్రి జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ పేడాడ రామ్మోహనరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జరిగింది. కలకత్తా లో వైద్య విద్యార్థినిని అత్యంత క్రూరంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆమదాలవలస ఎస్సై కే. వెంకటేష్ ఈ ర్యాలీ కి బందోబస్తు నిర్వహించారు.