శ్రీకాకుళం రోడ్(ఆముదాలవలస)రైల్వే స్టేషన్ ఓహెచ్ఈ కార్యాలయ ఆవరణలో సోమవారం భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా రైల్వే కార్మికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సింహంబట్ల ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ పూజలు జరిగాయి.
కార్మికులు బి శ్రీనివాసరావు, వెంకట్రావు, నూకరాజు, ఆదినారాయణ, పి జ్యోతి, శ్రీనివాస్ తదితరులు రైల్వే కార్మికులు పాల్గొన్నారు.