ఎచ్చెర్ల: యువ కవి కాపురెడ్డికి 'పర్యావరణ కవి' పురస్కారం

66చూసినవారు
విజయవాడలో జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన యువ కవి కాపురెడ్డి శ్రీనివాసురావుకు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా 'పర్యావరణ పరిరక్షణ' అంశంపై జరిగిన సమ్మేళనంలో ఆయన ఇచ్చిన ప్రతిభాపూర్వకమైన రచనకు పర్యావరణ కవి పురస్కారం లభించింది. ఈ మేరకు అయన మాట్లాడుతూ ఈ మహాసభలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పలువురు రచయితలు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్