ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఐటి హబ్ ఏర్పాటు చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు.
గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. విశాఖ నగరానికి సమీపంలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఐటి హబ్ ఏర్పాటు చేస్తే అభివృద్ధికి ఆస్కారం ఉందన్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్వాగతించారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.