ఎమ్మెల్యేను కలిసిన లావేరు, జి. సిగడాం మండలాల కూటమి నేతలు

77చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన లావేరు, జి. సిగడాం మండలాల కూటమి నేతలు
ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావును లావేరు, జి. సిగడాం మండలాల కూటమి నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం ఈశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం దుస్సాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా మంచి పరిపాలన అందిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :