వానాకాలం.. జరభద్రం

80చూసినవారు
వానాకాలం.. జరభద్రం
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కొబ్బరి చిప్పలు, ఖాళీ బొండాలు, కోడి గుడ్డు పెంకులు, మొక్కల తొట్టిలు, వృథాగా ఉన్న టైర్లు, వేసవిలో వాడిన కూలర్లలో నీళ్లు ఉంటే దోమలు తయారై డెంగీ ప్రబలే అవకాశం ఉంది. మురుగు, నిల్వ నీరు మలేరియా, ఫైలేరియా ప్రబలేందుకు దోహదం చేస్తాయి. వానాకాలంలో పరిస్థితి మరింత తీవ్రత చాటే అవకాశం ఉన్న దృష్ట్యా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల వద్ద నీటి నిల్వ పాత్రలు, కూలర్లు, డ్రమ్ములు ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్