డెంగీ జ్వరం వస్తే ఏం చేయాలి?

76చూసినవారు
డెంగీ జ్వరం వస్తే ఏం చేయాలి?
డెంగీ జ్వరం వచ్చినపుడు జాగ్రత్తగా మందులు వాడాల్సిందే. రక్త పరీక్ష చేయించుకుంటే డెంగీ అవునో కాదో తేలిపోతుంది. జ్వరం తగ్గిన తర్వాత చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, కడుపునొప్పి ఉండటం, వాంతులు కావడం లాంటి లక్షణాలు కనిపించగానే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. జ్వరం రాగానే ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి. దీనితో రక్తపోటు తగ్గకుండా ఉంటుంది. రోగనిరోధకతను పెంచుకోవడానికి ఆహారం, పండ్లు తీసుకోవాలి. 10-20 వేల కంటే తక్కువకు ప్లేట్‌లెట్లు పడిపోయినపుడే వాటిని ఎక్కించాలి. వీటన్నింటి కంటే దోమల నివారణ చాలా ముఖ్యమని గుర్తించాలి.

సంబంధిత పోస్ట్