రణస్థలం మండలం దేరసాం గ్రామంలో కోరాడ మాలచ్చికు చెందిన పురిల్లు అగ్నిప్రమాదంకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు దన్నాన రవీంద్ర వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 50 వేల నగదు, అరతులం బంగారం, కొన్ని ధ్రువపత్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.