శ్రీకాకుళం పట్టణంలోని బలగ నాగావళి నది తీరాన కొలువైన శ్రీ బాల త్రిపుర కాలభైరవాలయంలోని ఉన్న శ్రీ లక్ష్మీ గణపతికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పీఠం నిర్వాహకులు గణేశ్ గురూజీ ఆధ్వర్యాన స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.