ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును ఆయన క్యాంపు కార్యాలయంలో రణస్థలం మండలం పిహెచ్సీ వైద్యులు యమున, జనార్దన్, పలువురు సిబ్బంది గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పిహెచ్సీలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వారు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే పలు విషయాలపై చర్చించారు.