లావేరు: గుర్రాలపాలెంలో ఘనంగా బాలల దినోత్సవం
లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు జనపాల గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులకు మించిన దైవం లేరని వారిని తప్పకుండా గౌరవించాలని చెప్పారు.