రోజంతా ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ కవిటి మండలంలోని డి. గొనపపుట్టుగలో ఆదివారం రాత్రి పల్లెనిద్ర చేశారు. గ్రామానికి వచ్చిన ఆమెకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక వీధుల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత మండపంలో పడుకోవడానికి ముందు పలువురు మహిళలతో ముచ్చటించారు.