ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం.. 2026లో జనాభా లెక్కల అనంతరం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల నుంచి 225కు పెంచనున్నట్లు తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ, ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు చేయనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా మార్చి 1, 2014న గెజిట్లో ప్రచురించినట్లు వివరించింది.