మందు బాబులకు షాకింగ్ న్యూస్. మద్యం కొంచెం తాగినా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చు అని ఓ కొత్త స్టడీ వెల్లడించింది. వృద్ధుల్లో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా పరిశోధకులు బ్రిటన్‌లో లక్ష మందికి పైగా పరిశీలించారు. 60 ఏళ్లు పైబడిన 1,35,103 మంది వృద్ధుల మీద 12 ఏళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. లైట్, మోడరేట్ ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ అధ్యయనం ఫలితాలను జమ నెట్‌వర్క్ ఓపెన్‌లో పబ్లిష్ చేశారు.