ఆగస్టు 19న రక్షాబంధన్. తెలుగు రాష్ట్రాల వారు సోదర సోదరీమణుల బంధాన్ని ఘనంగా చేసుకునే వేడుక ఇది. రాఖీ కట్టేటప్పుడు సోదరుడు నేలపై తూర్పు ముఖంగా కూర్చోని రాఖీ కట్టించుకోవాలి. ఇక సోదరి తన సోదరుడికి పడమటి ముఖంగా ఉండి.. కుంకుమ, చందనంతో తిలకం దిద్దాలి. అనంతరం అక్షింతలు వేసి కుడి చేతికి రాఖీ కట్టాలి. హారతి ఇచ్చి స్వీట్స్ తినిపించి.. తన దీవెనలను అందించాలి.