సోమవారం నుంచి ఏపీలోని 15 శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీరిలో అధిక శాతం మంది బదిలీలపై విముఖంగా ఉన్నారు. ఆ మార్గదర్శకాలు నేడు వెలువడొచ్చని, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయొచ్చని సమాచారం.