కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.