కంచిలి మండలం అంపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి చక్కెర బస్తాల లోడ్తో భువనేశ్వర్ వెళుతున్న లారీ టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ పైన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.