కవిటి మండలం జాడుపూడి ఆర్ఎస్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వెళ్తున్న బొలెరో లగేజీ వ్యాన్ను అధిగమించే క్రమంలో వెనుక నుంచి అతివేగంగా ఐచర్ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు రహదారికి అడ్డంగా బోల్తా పడ్డాయి. దీంతో ఇరు వాహనాల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 1033 నేషనల్ హైవే సిబ్బంది క్షతగాత్రులను సోంపేట ఆసుపత్రికి తరలించారు.