వర్షం లేక ఎదుగుదలలేని మొలకలు

69చూసినవారు
సోంపేట మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు ఎంతో ఆశతో వరి విత్తనాలు వేశారు. అనంతరం సరైన వర్షం లేక మొలక ఎదుగుదల రాక రైతులు ఆవేదన చెందుతున్నారు. రానున్న 2, 3 రోజుల్లో వర్షం కురవకపోతే ఆకు మడులలోని వరి విత్తనాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని పైడిగాం ఛానల్ మాజీ అధ్యక్షులు బి. రామారావు బుధవారం తెలిపారు. సకాలంలో నీరు అందకపోతే పూర్తిగా వరి నారుమడులు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్