కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరరం ఎమ్యెల్యే కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు పంచి పెట్టారు. శ్రీ చింతామణి అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే అశోక్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.