నరసన్నపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

70చూసినవారు
నరసన్నపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
నరసన్నపేట పట్టణంలోని కళాశాల మైదానంలో శనివారం సత్య సాయి యూనిటీ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సత్యసాయి సేవాసమితులు జోనల్ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పైన ఆసక్తిని పెంపొందించుకోవాలని కోరారు. క్రీడలతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్