ప్రపంచ శాంతి దూత అలుపెరగని స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన స్వాతంత్ర పోరాట తీరును ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.