నందిగం మండలం కందులగూడెం గ్రామానికి చెందిన జీ. భారతి అనే గిరిజన మహిళ ఆదివారం 108 వాహనంలో ప్రసవించింది. గ్రామానికి చెందిన భారతి అనే గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించే క్రమంలో నొప్పులు అధికం కావడంతో సిబ్బంది సహాయంతో 108 అంబులెన్స్ ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండగా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.