పాతపట్నంలో ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి

54చూసినవారు
పాతపట్నంలో ఉచిత స్టడీ సర్కి ఏర్పాటు చేయాలని నియోజకవర్గానికి చెందిన పలువురు నిరుద్యోగులు అన్నారు. బుధవారం పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ను వారంతా కలిశారు. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించడం సంతోషకరమని, శిక్షణ తీసుకోవడానికి సరైన స్టడీ సర్కిల్ లేదని ఆయన దృష్టిలోకి తీసుకెళ్లారు. అయితే తన సొంత ఖర్చులతో స్టడీ సర్కిల్ పాతపట్నంలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్